భారతదేశం, సెప్టెంబర్ 8 -- కమల్ హాసన్, రజినీకాంత్ ఇద్దరూ కలిసి నటించే సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే మూవీలో తెర పంచుకుంటే ఫ్యాన్స్ కు కిక్కే కిక్కు. తమ ప్రారంభ సంవత్సరాల్లో అపూర్వ రాగంగళ్, మూండ్రు ముడిచు, అవర్గల్, పతినారు వయతినిలే నుండి అనేక చిత్రాలలో కలిసి పనిచేశారు. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సైమా వేదికపై కమల్ హాసన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

సైమా అవార్డ్స్ వేదికపై కమల్ హాసన్ కీలక ప్రకటన చేశారు. కల్కి 2898 ఏడీ సినిమాలో నటనకు గాను అవార్డు అందుకున్న ఈ సీనియర్ నటుడిని మళ్లీ రజనీకాంత్ తో కలిసి నటించే సినిమాను ఆశించగలమా అని అభిమానులు అడిగారు.

దీనికి కమల్ ఏమన్నారంటే.. ''ఇది తరమన సాంబవం (అద్భుతమైన సంఘటన). అదెప్పుడో మాకు...