Hyderabad, జూలై 31 -- విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన మూవీ కింగ్డమ్ థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో విజయ్ హిట్ కొట్టినట్లే అంటూ ఇప్పటికే ట్విటర్ రివ్యూలు కూడా వచ్చేశాయి. అయితే ఇందులోని రగిలే రగిలే పాట మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అనిరుధ్ అందించిన మ్యూజిక్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.

అనిరుధ్ రవిచందర్.. ఇప్పుడీ పేరు తమిళనాడులోనే కాదు దేశమంతటా మార్మోగిపోతోంది. ఈ మధ్యకాలంలో అతడు ఇచ్చిన మ్యూజిక్ అలా ఉంటోంది మరి. తాజాగా కింగ్డమ్ తో మరోసారి తన లెవెల్ ఏంటో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలోని రగిలే రగిలే సాంగ్, బీజీఎం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తూ.. సినిమాకు పెద్ద ప్లస్ గా నిలుస్తున్నాయి. ఈ పాటను సిద్ధార్థ్ బస్రూర్ పాడాడు.

ఈ పాటను కృష్ణ కాంత్ రాశాడు. లిరిక్స్ కూడా మ్యూజిక్ కు తగినట్లుగానే ఉన్నాయి....