Hyderabad, ఏప్రిల్ 21 -- రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించాలంటే మనకు సాధారణంగా గుర్తొచ్చేది ఆహారం, వ్యాయామం. ఈ రెండు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే డయాబెటీస్ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుందని చాలా మందికి తెలుసు. అయితే తాజా పరిశోధనల ప్రకారం షుగర్ వ్యాధి బాధితులు ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమవుతోంది.

నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోతుంది, ఆకలి ఎక్కువవుతుంది. దీని వల్ల ఆహార పరిమితి అదుపులో ఉండదు. ఇవన్నీ కలిపి రక్తంలో గ్లూకోజ్ స్తాయిల్లె హెచ్చు థగ్గులు జరిగే ప్రమాదం పెరుగుతుందట. షాకింగ్ విషయం ఏంటంటే.. కేవలం ఒక్క రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్లే ఇన్సులిన్ స్పందన 25% వరకు తగ్గిపోయే ప్రమాదముందని తాజాగా అధ్యయనం చెబుతోంది.

నిద్ర శరీరంలో ఇన్సులిన్‌ను సమర్థంగా ఉపయోగించడంలో సహాయప...