Hyderabad, మే 23 -- రక్తం అంటేనే ఎంతోమంది భయపడతారు. ఇక రక్తంతో తడిసిన గ్లౌజులు.. అవి కూడా వందేళ్ల క్రితం నాటివి. వాటిని ఎవరు కొనుక్కుంటారు? అయినా సరే వాటిని వేలం వేశారు. ఊహించని రీతిలో అవి కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. అవి సాదాసీదా చేతి తొడుగులు కావు. ఎంతో ప్రత్యేకమైనవి... అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఉపయోగించిన గ్లౌజులు అవి.

బానిసత్వాన్ని నిర్మూలించేందుకు అబ్రహం లింకన్ ఎంతో కష్టపడ్డాడని చెప్పుకుంటారు. అతడిని గొప్ప నాయకుడుగా వర్ణిస్తారు. అతడిని ఒకరోజు రాత్రి కాల్చి చంపారు దుండగులు. అలా చంపినప్పుడు అతడి పాకెట్లో ఈ గ్లౌజులు ఉన్నాయి. అతని రక్తంతోనే ఆ చేతి తొడుగులు తడిసిపోయాయి. అందుకే ఇవి చారిత్రాత్మక వస్తువుల్లో భాగంగా మారిపోయాయి. ఇన్నాళ్లు వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. ఇప్పుడు వాటిని వేలం వేస్తే ఏకంగా కోట్ల రూపాయలనిచ్చి అతని ...