భారతదేశం, అక్టోబర్ 29 -- ఓటీటీలు వచ్చాక ఆ భాష, ఈ భాష అనే సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూసేందుకు ఆడియన్స్ రెడీగా ఉంటున్నారు. ముఖ్యంగా మలయాళం చిత్రాలంటే స్పెషల్ క్రేజ్ ఉంది. మంచి ఫీల్ గుడ్ మలయాళం మూవీ ఒకటి ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. బొల్లి వ్యాధి ఉన్న యువకుడు హీరో కావాలనే కల కంటాడు. ఈ స్టోరీతోనే 'తలవర' మూవీ వచ్చింది.

అర్జున్ అశోకన్ హీరోగా నటించిన ఫీల్-గుడ్ మలయాళ డ్రామా 'తలవర' ఇప్పుడు ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రేవతి శర్మ ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ ఇవాళ (అక్టోబర్ 29) ఓటీటీలోకి అడుగుపెట్టింది. బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మలయాళం సినిమా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది.

నిజానికి తలవర మూవీ ఆగస్టు 22, 2025లో థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు రెండు నెలల తర్వాత అక్టోబర్ 29న ఓటీటీలోక...