Hyderabad, జూలై 2 -- రామ్ చరణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' ముందుంటాయి. సుకుమార్, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలు రామ్ చరణ్ కేవలం స్టార్ మాత్రమే కాదు, అద్భుతమైన నటుడు అని నిరూపించాయి. ఇప్పుడు, రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

ఈ ఏడాది మే నెలలో.. లండన్, యూకేలో తన మేడమ్ టుస్సాడ్స్ మైనపు విగ్రహం ఆవిష్కరణ కోసం రామ్ చరణ్ వెళ్లారు. అదే రోజు, ఆవిష్కరణ తర్వాత ఆయన ఒక అభిమానుల సమావేశంలో పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. రామ్ చరణ్ 'పెద్ది' సినిమాను తాను చేసిన ప్రాజెక్టులలోకెల్లా అత్యంత 'ఉత్తేజకరమైనది' అని...