భారతదేశం, జనవరి 13 -- టాక్సిక్ మూవీ నుంచి రాయగా హీరో యష్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఇటీవల రిలీజైన టీజర్ కలకలం రేపుతోంది. ఇందులో ఇంటిమేట్ సీన్ మరీ బోల్డ్ గా ఉండటమే ఇందుకు కారణం. ఈ టీజర్ పై విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా టీజర్ పై చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు కర్ణాటక మహిళా కమిషన్ లెటర్ రాసింది. దీంతో యష్ టాక్సిక్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది.

యష్ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమా టీజర్ వివాదాస్పదంగా మారింది. ఈ టీజర్‌లో కారులో ఒక మహిళతో యష్ శృంగారం చేస్తాడు. ఆ తర్వాత బయటకు వచ్చి కొంతమందిని కాల్చి చంపుతాడు. ఈ సన్నివేశాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు ఈ టీజర్ వివాదాల్లో చిక్కుకుంది. సోమవారం (జనవరి 12) నాడు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ (KSWC)కు ఫిర్యాదు చేసింది.

పీటీఐ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్...