Hyderabad, ఏప్రిల్ 18 -- గుడ్ ఫ్రైడే లూనార్ క్యాలెండర్ ఆధారంగా క్రైస్తవ మతాధికారులు నిర్ణయిస్తారు. ఈ పండుగ ఈసారి ఏప్రిల్ 18వ తేదీన వచ్చింది. ప్రతి ఏడాది మార్చి 21 తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి ఆధారంగా ఈస్టర్, గుడ్ ఫ్రైడే పండగలను నిర్ణయిస్తారు. మార్చి 21 తర్వాత మొదటి పౌర్ణమి గడిచిన వెంటనే వచ్చే శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అని, ఆదివారాన్ని ఈస్టర్ అని నిర్వహించుకుంటారు.

మార్చి 21 తేదీకి ఒక ప్రత్యేకత ఉంది... అందుకే ఆ తేదీనే బట్టే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు నిర్ణయిస్తారు. మార్చి 21న రాత్రి పగలు సమంగా ఉంటాయని చెబుతారు.

బైబిల్ చెబుతున్న ప్రకారం యేసును శిలువ వేయడానికి గురువారమే బంధించారని చెబుతారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు మత నాయకులు అతనిపై విచారణ జరిపారు. యేసుపై రాజద్రోహం ఆరోపణలను మోపారు. రోమన్ చక్రవర్తి పొంటిఎస్ పిలాతు ముందు ఆయనను హాజరపరిచారు...