భారతదేశం, సెప్టెంబర్ 9 -- ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్ మీద అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయ ముందు వైసీపీ శ్రేణులు శాంతియుత ఆందోళనలు చేపట్టాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో కొన్ని ప్రాంతాల్లో వాగ్వాదం జరిగింది. కొందరికి పోలీసులు ముందుగానే నోటీసులు కూడా ఇచ్చారు.

రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చేయాలని, ఉల్లి, టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నిరసనలో వైసీపీ శ్రేణులు, రైతులు డిమాండ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో అన్నదాత పోరుకు భారీగా జనం తరలివచ్చారు. యూరియా కోసం పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు.

అనకాపల్లి జిల్లాలో అనుమతి లేదని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. అనంతపురంలో నిరసనలపై ఆంక్షలు విధించారు...