భారతదేశం, ఆగస్టు 15 -- యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రతిరోజూ కోట్లాది యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు యూపీఐ చెల్లింపు వ్యవస్థను అప్డేట్ చేస్తోంది. వినియోగదారుల భద్రత కోసం యూపీఐ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. అయితే ఈసారి కలెక్ట్ రిక్వెస్ట్ అనే ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫీచర్ త్వరలో నిలిపివేస్తారు. ఈ మేరకు ఇటీవల ఒక సర్క్యూలర్ జారీ చేసింది.

అక్టోబర్ 1, 2025 నుండి యూపీఐ యాప్‌లలో కలెక్ట్ రిక్వెస్ట్స్(రిక్వెస్ట్ మనీ) ఫీచర్‌ను నిలిపివేయాలని ఎన్‌పీసీఐ బ్యాంకులు, చెల్లింపు యాప్‌లను ఆదేశించింది. ఈ విషయంలో ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. అక్టోబర్ 1 నాటికి బ్యాంకులు, చెల్లింపు సర్...