భారతదేశం, జూలై 21 -- డిజిటల్ చెల్లింపుల రంగంలో భారతదేశం టాప్‌లో ఉంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీల వినియోగం రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. భారతదేశం ఈ లావాదేవీల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇటీవల విడుదల చేసిన నివేదిక తెలిపింది.

ఈ ఏడాది జూన్ నెలలో యూపీఐ ద్వారా మొత్తం రూ.24.03 లక్షల కోట్లు బదిలీ అయ్యాయి. ఈ నెలలో 18.39 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో కేవలం 13.88 బిలియన్ లావాదేవీలు మాత్రమే జరిగాయి. అంటే ఒక సంవత్సరం కాలంలో 32 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం, 49.1 కోట్ల మంది సామాన్యులు, 6.5 కోట్ల మంది వ్యాపారులు ఈ యూపీఐ సేవలను ఉపయోగిస్తున్నారు.

భారతదేశంలో మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 85 శాతం యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. ప్రపంచంలోని రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 50 శాతం భార...