భారతదేశం, ఏప్రిల్ 22 -- సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE) తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏప్రిల్ 22న ప్రకటించింది. ఈ పరీక్షలో టాప్ ర్యాంకర్ గా శక్తి దూబే నిలిచారు. ఈ ఏడాది సివిల్స్ పరీక్షలో తెలుగమ్మాయి ఎట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంక్ సాధించారు. UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE) 2024 ఇంటర్వ్యూ కు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు తమ తుది ఫలితాలను యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.inలో చూసుకోవచ్చు.

UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో తుది ఫలితాలను షార్ట్‌లిస్ట్ ఫార్మాట్‌లో ప్రకటించింది. ఫలితాల పత్రంలో నియామకానికి ఎంపికైన అభ్యర్థుల పేర్లు ఉంటాయి. దేశంలో అత్యంత పోటీ పరీక్షలలో ఒకటి యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష. ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాస్టుంటారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరిగే ఈ ...