భారతదేశం, జనవరి 14 -- దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోస్టుల నోటిఫికేషన్​ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేయాల్సిన 'సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (సీఎస్​ఈ) 2026' నోటిఫికేషన్ వాయిదా పడింది. దీనితో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్​ఎస్​) నోటిఫికేషన్‌ను కూడా కమిషన్ నిలిపివేసింది. అభ్యర్థులు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను upsc.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

నిజానికి, యూపీఎస్సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం ఈ నోటిఫికేషన్ నేడు, అంటే జనవరి 14న విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల దీనిని వాయిదా వేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది.

"పరిపాలనా పరమైన కారణాల దృష్ట్యా జనవరి 14న విడుదల కావాల్సిన సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 నోటిఫికేషన్లను వాయిదా వ...