భారతదేశం, మే 14 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కొత్త ఛైర్ పర్సన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు. అజయ్ కుమార్ నియామకాన్ని ప్రకటిస్తూ డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ ఆఫ్ ట్రైనింగ్ మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 316(1) ప్రకారం డాక్టర్ అజయ్ కుమార్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమించారు.

యూపీఎస్సీ చైర్మన్ గా కేరళ కేడర్ కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అజయ్ కుమార్ పదవీకాలం ఆయన ఆ పదవి చేపట్టిన నాటి నుంచి ప్రారంభమవుతుందని డీవోపీటీ తెలిపింది. అజయ్ కుమార్ కన్నా ముందు కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుడాన్ యూపీఎస్సీ చైర్మన్ గా ఉన్నారు. ఆమె పదవీ కాలం ఏప్రిల్ 29, 2025 తో ముగిసింది. మనోజ్ సోనీ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో యూ...