భారతదేశం, ఆగస్టు 21 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ (ఈఓ), అకౌంట్స్ ఆఫీసర్(ఏఓ), అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్(ఏపీఎఫ్‌సీ) పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది. మొదట ఆగస్టు 18న ముగియాల్సి ఉండగా దరఖాస్తు విండో ఇప్పుడు ఆగస్టు 22, 2025 వరకు తెరిచి ఉంటుంది. ఇప్పుడు అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి ఒక్కరోజే మిగిలి ఉన్నది.

ఈ నియామక డ్రైవ్ ద్వారా మొత్తం 230 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 156 పోస్టులు EO/AOకి, 74 పోస్టులు APFCకి ఉన్నాయి.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ నియామకానికి అర్హులు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టుకు గరిష్ట వయోపరిమితి 35 సంవత...