భారతదేశం, డిసెంబర్ 4 -- రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మంది అభ్యర్థులకు సింగరేణి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, సింగరేణి సీఎండి బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభకు ఆర్థిక ఇబ్బందులు అడ్డురాకూడదనే సంకల్పంతో మెయిన్స్‌కు ఎంపికైన వారికి లక్ష రూపాయలు, ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారికి అదనంగా మరో లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అలాగే ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

'గతేడాది 20 మంది ఎంపిక కాగా, ఈసారి 50 మంది అర్హత సాధించడం ప్రశంసనీయం. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య ఎంత పెరిగినా ఎంతమందికైనా ఆర్థిక సాయం అందిచడం జరుగుతుంది. సీనియర్ అధికారులతో ఇంటర్వ్యూ బోర్డు ఏర్పాటు...