భారతదేశం, ఫిబ్రవరి 18 -- టెక్ ప్రపంచంలో మరో దిగ్గజం సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి వినోదాన్ని పంచే యూట్యూబ్ (YouTube) అమెరికాలో అకస్మాత్తుగా నిలిచిపోయింది. బుధవారం ఉదయం నుంచి వేలాది మంది యూజర్లు తమకు వీడియోలు ప్లే కావడం లేదని, వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవుటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ 'డౌన్ డిటెక్టర్' (Downdetector) గణాంకాల ప్రకారం.. సుమారు 2,80,000 మందికి పైగా యూజర్లు యూట్యూబ్ సేవల్లో అంతరాయం ఎదుర్కొన్నారు. కేవలం ప్రధాన యూట్యూబ్ యాప్ మాత్రమే కాకుండా, యూట్యూబ్ టీవీ (YouTube TV) సేవల్లో కూడా సమస్యలు తలెత్తాయి. సుమారు 7,000 మందికి పైగా యూట్యూబ్ టీవీ వినియోగదారులు కూడా ఫిర్యాదులు నమోదు చేయడం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.

యూట్యూబ్ ఓపెన్ చేయగానే చాలా మందికి 'సమ్ థింగ్ ...