భారతదేశం, సెప్టెంబర్ 6 -- తెలుగు ఆడియన్స్ ను మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు వచ్చేస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి రేపే (సెప్టెంబర్ 7) తెరలేవనుంది. మరోసారి కింగ్ నాగార్జున హోస్ట్ గా ఈ మెగా రియాలిటీ షో ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రీమియర్ కానుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్లపై బజ్ నెలకొంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఓ లిస్ట్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో రీతూ వర్మ తదితరుల పేర్లున్నాయి. అయితే ఇదే లిస్ట్ లో యూట్యూబ్ సెన్సేషనల్ ఫోక్ సింగర్ నాగ దుర్గ పేరు కూడా ఉంది. దీంతో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ఖాయమనిపించింది. కానీ నాగ దుర్గ సడెన్ షాక్ ఇచ్చింది.

డ్యాన్స్ తో పాటు అందంతోనూ అదరగొట్టే ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ సడెన్ షాక్ ఇ...