భారతదేశం, నవంబర్ 28 -- కన్నడ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ 'అంతిమ క్షణగళ్లు' మరో ఓటీటీలోకి వచ్చేసింది. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ కచ్చితంగా థ్రిల్ పంచే అవకాశముంది. ఈ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ మంచి ఆదరణ దక్కుతోంది. ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ కు 8.3 ఐఎండీబీ రేటింగ్ ఉండటం విశేషం. ఈ మూవీ ఏంటీ? ఏ ఓటీటీలో ఉందో చూసేద్దాం.

కన్నడ హారర్ మిస్టరీ థ్రిల్లర్ అంతిమ క్షణగళ్లు సినిమా ఇవాళ (నవంబర్ 28) మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం 'బిసినీఈటీ' ఓటీటీలో శుక్రవారం రిలీజైంది. ఇది 'బి సినీ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్'కు చెందిన ఓటీటీ ప్లాట్ ఫామ్. ప్రాంతీయ భాషల్లో కంటెంట్ ను ఇది స్ట్రీమింగ్ చేస్తోంది. ఇప్పుడు కన్నడ సినిమా అంతిమ క్షణగళ్లు సినిమా ఈ ఓటీటీలోకి వచ్చింది.

కన్నడ సినిమా అంతిమ క్షణగళ్లు మూవీ ఇప్పటికే బుక్ మై షో స్ట్రీమ్ లో ఇప్పట...