భారతదేశం, మే 10 -- బిగ్‌బాస్ బ్యూటీ శ్వేతా వ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తెలుగు అంథాల‌జీ మూవీ ఏక‌మ్ యూట్యూబ్‌లో రిలీజైంది. డ్రామా థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో అభిరామ్ వ‌ర్మ‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, అదితి మ్యాక‌ల్‌, క‌ల్పిక గ‌ణేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. వంశీరామ్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2021లో అక్టోబ‌ర్‌లో ఏక‌మ్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. డిఫ‌రెంట్ అటెంప్ట్‌గా ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. ఐఎమ్‌డీబీలో ప‌దికిగాను 7.2 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. ఏక‌మ్ మూవీకి జోన్ ఫ్లాంక్లిన్ మ్యూజిక్ అందించాడు.

ఆనంద్ చిన్న‌వ‌య‌సులోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోతాడు. జాబ్ పోవ‌డంతో పాటు ప్రేమ‌లో బ్రేక‌ప్ అవుతుంది. ప్ర‌పంచాన్వేష‌ణ‌కు బ‌య‌లుదేరుతాడు. అయ్య‌ప్ప ఓ పూజారి. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల తాను కొలుస్తోన్న దేవుడిని దొంగ‌త‌...