భారతదేశం, డిసెంబర్ 16 -- రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న పెద్ది మూవీలోని చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్‌లో సంచలనాల పరంపర కొనసాగిస్తోంది. గత నెల 7వ తేదీన ఈ పాటను మేకర్స్ రిలీజ్ చేయగా.. 40 రోజుల్లోనే అరుదైన 100 మిలియన్ల మార్క్ అందుకోవడం విశేషం. తెలుగులో ఆల్ టైమ్ బెస్ట్ చార్ట్‌బస్టర్ గా రికార్డు క్రియేట్ చేసే దిశగా దూసుకెళ్తోంది.

బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో వస్తున్న పెద్ది మూవీ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన సాంగ్ చికిరి చికిరి. ఈ పాట తాజాగా యూట్యూబ్ లో ఒకేసారి రెండు అరుదైన రికార్డులను అందుకుంది. కేవలం తెలుగులో 100 మిలియన్లు, అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ల వ్యూస్ నమోదు చేయడం విశేషం. ఈ విషయాన్ని ఆ మూవీ టీమ్ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది.

"చికిరి చికిరికి సెంచరీ. ఈ ప్రేమకు రుణపడి ఉంటాం. తెలుగులో 100 మిలియన్ ప్లస్, మొత్తం 5 భాషల...