భారతదేశం, అక్టోబర్ 28 -- సాధారణంగా సినిమాలో సాంగ్స్ బాగుంటే ఆదరణ దక్కించుకుని మంచి హిట్ అవుతాయి. సినిమా సాంగ్స్ కాకుండా పలు మ్యూజిక్ వీడియోలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. లవ్ ఆధారంగా రొమాంటిక్‌ లిరిక్స్‌తో ఎన్నో సాంగ్స్ అవుతున్నాయి. వాటిలో కొన్ని మంచి హిట్స్‌గా నిలుస్తున్నాయి.

ఇప్పుడు చెప్పుకునే సాంగ్ కూడా మంచి ఆదరణ పొందుతోంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతు అందరి మన్ననలు పొందుతోంది ఈ సాంగ్. ఆ పాట పేరే 'ఏమి మాయ ప్రేమలోన'. లవ్ రొమాంటిక్ మ్యూజిక్ వీడియోగా ఈ సాంగ్ తెరకెక్కింది. ఇటీవల యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి టాక్ తెచ్చుకుంటోంది.

అంతేకాకుండా అధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటోంది. అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఈ రొమాంటిక్ సాంగ్ తెరకెక్కింది. హృద్యమైన ప్రేమగాథను మనసుకు హత్తుకున...