భారతదేశం, మే 5 -- బాలీవుడ్ కొత్త ఫిల్మ్ హౌస్ ఫుల్ 5 చిత్రంలోని ఫస్ట్ సాంగ్ 'లాల్ పరి' యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ పార్టీ సాంగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ తో ర్యాప్ స్టార్ యోయో హనీ సాంగ్ పేరు మార్మోగుతోంది. ఈ పాటను రాయడమే కాకుండా హనీ సింగ్ పాడాడు కూడా. దీంతో హనీ సింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

హౌస్ ఫుల్ 5 నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ 'లాల్ పరి' వీడియో యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. మే 3న ఈ పాటను విడుదల చేశారు మేకర్స్. ఇంటర్నెట్లో ఇన్ స్టంట్ హిట్ అయిన ఈ పాట కేవలం 24 గంటల్లో 21 మిలియన్ల (2.1 కోట్ల)కు పైగా వ్యూస్ సాధించింది. అల్ఫాజ్ తో కలిసి హనీ సింగ్ ఈ పాటకు స్వయంగా లిరిక్స్ రాశాడు. ఈ సాంగ్ ను హనీ సింగ్, సిమర్ కౌర్ ఆలపించారు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ సాంగ్ కు రెమో డిసౌజా కొరియోగ్రాఫర్.

'లాల్ పరి' సాంగ్...