భారతదేశం, డిసెంబర్ 11 -- యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌‌కు తాజాగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు నామినేట్ అయ్యారు. శనిగరం గ్రామంలో సామాన్య మధ్యతరగతి గ్రామంలో ఉదయ్ నాగరాజు జన్మించారు.

తాజాగా ఉదయ్ యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపికయ్యారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు సభ్యులను ప్రధాన మంత్రి సలహా మేరకు కింగ్ ఆఫ్ ఇంగ్లండ్ నామినేట్ చేస్తారు. రాజకీయ పార్టీలు, స్వతంత్ర కమిటీ, ప్రజల నుండి కూడా నామినేషన్లు వస్తాయి. ప్రధానంగా నైపుణ్యం, అనుభవం, దేశానికి సేవ ఆధారంగా హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపిక చేస్తారు. భారతీయ సంతతికి చెందిన వారు కూడా నామినేట్ అవుతారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ. ఇది చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం, ముఖ్యమైన అంశాలపై చర్చించడం వంటి ప్రధాన వి...