భారతదేశం, మే 28 -- అమెరికాలోని యూనివర్సిటీలు, అంతర్జాతీయ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది! స్టూడెంట్​ వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆదేశించారు. విద్యార్థుల సోషల్​ మీడియా ప్రొఫైల్స్​ని ట్రంప్​ ప్రభుత్వం అత్యంత కఠినంగా పరిశీలిస్తున్న సమయంలో ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం.

అమెరికా జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారంటూ అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్​ ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఇదే విషయంపై యూనివర్సిటీలతో కూడా ట్రంప్​నకు గొడవ నడుస్తోంది. ఇక ఇప్పుడు స్టూడెంట్​ వీసా ఇంటర్వ్యూలు నిలిపివేయడం అనేది వైట్ హౌస్, విశ్వవిద్యాలయాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రమాదాన్ని పెంచుతుంది. పరిస్థితి మొదట...