భారతదేశం, అక్టోబర్ 31 -- అమెరికాలో పనిచేస్తున్న వలసదారుల వర్క్​ పర్మిట్​ ఆటోమెటిక్​ రెన్యువల్​ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి మరోసారి అందరికి షాక్​ ఇచ్చింది డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం. దీని ప్రకారం.. అమెరికాలో ఉన్న విదేశీ ఉద్యోగుల పత్రాల ఆటోమేటిక్ పొడిగింపు ఇకపై ఉండదు! ఈ నిర్ణయం కారణంగా అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొన్ని వర్గాలకు చెందిన విదేశీ ఉద్యోగుల ఉద్యోగ అధికార పత్రాల (ఈఏడీ) చెల్లుబాటును స్వయంచాలకంగా పొడిగించే విధానాన్ని అక్టోబర్ 30, 2025 నుంచి రద్దు చేసింది.

మాజీ అధ్యక్షుడు జో బైడెన్​ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆటోమేటిక్ పొడిగింపు విధానం వల్ల, విదేశీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్‌లకు వారి వర్క్ పర్మిట్‌ల కోసం తప్పనిసరిగా పునః-పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం తప్పే...