భారతదేశం, జూన్ 1 -- ఉన్నత చదువుల కోసం భారతీయ విద్యార్థులు దశాబ్దాల కాలంగా అమెరికా, యూకేలను ప్రిఫర్​ చేస్తున్నారు. కానీ భౌగోళిక- రాజకీయ అనిశ్చితుల కారణంగా ఆయా దేశాలు కాకుండా, రానున్న రోజుల్లో భారతీయ విద్యార్థులు ఇతర ప్రత్యామ్నాయాలను వెత్తుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్​, యూకేకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేశాల వివరాలను, వీటిని ఎంచుకోవడానికి గల కారణాలను ఇక్కడ తెలుుసుకోండి..

జర్మనీ- ఉన్నత విద్యకు జర్మనీ అనాదిగా ప్రసిద్ధి! అంతర్జాతీయ విద్యార్థులు ఈ దేశానికి చదువు కోసం వెళుతుంటారు. ఇక్కడ జాతికి సంబంధం లేకుండా పబ్లిక్​ యూనివర్సిటీలు ట్యూషన్​ ఫీజును ఉచితంగా ఇస్తుంటాయి. టెక్నికల్​ యూనివర్సిటీ ఆఫ్​ మునిచ్​, లాడ్విగ్​ మాక్సిమిలన్​ యూనివర్సిటీ ఆఫ్​ మునిచ్​, హంబోల్డ్​ యూనివర్సిటీ ఆఫ్​ బెర్లిన్​, యూనివర్సిటీ ఆఫ్​ బాన్​ వంటి విశ్వవిద్యాలయాలు అంతర్...