భారతదేశం, అక్టోబర్ 25 -- యువరాజ్ సింగ్ తండ్రి, భారత మాజీ పేసర్ యోగరాజ్ సింగ్ పాత చర్చను మళ్లీ తెరపైకి తెచ్చి కొత్త వివాదానికి నిప్పు రాజేశారు. ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన యువరాజ్ సింగ్‌ను భారతదేశపు గొప్ప క్రికెటర్‌గా అభివర్ణించడమే కాకుండా, తన కొడుకు ప్రతిభను చూసి ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి భయపడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారతదేశపు గొప్ప క్రికెటర్ ఎవరు? అనే చర్చ మరోసారి జరుగుతున్న నేపథ్యంలో యోగరాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యోగరాజ్ సమాధానాలు చాలా ఘాటుగా, వివాదాస్పదంగా ఉన్నాయి. యోగరాజ్ నమ్మకం ప్రకారం యువరాజ్ ఇండియా ఆల్-టైమ్ గ్రేట్.

"మీరు ఆల్-రౌండర్ల గురించి మాట్లాడితే కపిల్ దేవ్ ఉన్నారు. బ్యాట్స్‌మెన్ల గురించి మాట్లాడితే యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి వారు ఉన్నారు...