భారతదేశం, మే 3 -- తమిళనాడులోని హోసూర్‌లో ఒక జిమ్ ట్రైనర్ ను తన భార్యను హత్య చేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, తాను హత్య చేయలేదని, తాము బాండేజ్ సెక్స్ చేస్తుండగా, ముక్కు నుంచి రక్తం కారి ఆమె చనిపోయిందని అతడు పోలీసులకు తెలిపాడు. ఆ యువతి తల్లిదండ్రులు తమ కుమార్తెది హత్యేనని, తమ అల్లుడే ఈ హత్య చేశాడని ఆరోపిస్తున్నారు.

34 ఏళ్ల భాస్కర్ జిమ్ ట్రైనర్. అతడు నాలుగు జిమ్‌లను నిర్వహిస్తున్నాడు. అతని భార్య శశికళ మహిళల జిమ్‌ను నడుపుతోంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్న తర్వాత 2018లో ఈ జంట వివాహం చేసుకున్నారు. వివాహం సమయంలో శశికళ బెంగళూరులో ప్లేయింగ్ స్కూల్‌ను నిర్వహించేవారు. ఆ తరువాత ఆమె కూడా జిమ్ నిర్వహణ బిజినెస్ లోకి వచ్చారు. వారికి 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు.

భాస్కర్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం, ఏప...