భారతదేశం, మే 26 -- ఇటీవల రాష్ట్రంలో ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డుపై కర్రతో కొట్టిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తెనాలిలో జరిగినట్టు తెలుస్తోంది. అందరూ చూస్తుండగానే పోలీసులు యువకులను దారుణంగా కొట్టారు. దీని గురించి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదటి వెర్షన్ ప్రకారం..

కన్నా చిరంజీవి అనే వ్యక్తి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి 2 టౌన్‌కి సంబంధం లేదు. పోలీసు కానిస్టేబుల్ (పీసీ 6068) కన్నా చిరంజీవి.. 2 టౌన్ పరిధిలోకి వచ్చి ఈ యువకులను డబ్బులు ఇవ్వమని అడిగారు. లేకపోతే అక్రమ కేసులు, గంజాయి కేసులు పెడతామని చెప్పారు. 3 టౌన్ సీఐ రమేష్ బాబు చెప్పమన్నారని బెదిరించారు.

డబ్బులు ఇవ్వడానికి యువకులు తిరస్కరించారు. ఆగ్రహించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి.. ఎక్కడ అతని అవినీతి బయటకు వస్తుంద...