భారతదేశం, మే 9 -- ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న మురళి నాయక్.. మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. పాక్ జరిపిన కాల్పుల్లో చనిపోయారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా గ్రామానికి చెందిన శ్రీరామ్ నాయక్ కుమారుడు.. మురళీ నాయక్ మృతిచెందారు. మురళీ నాయక్‌ మరణవార్త విని కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.

మురళీ నాయక్ మృతదేహం రేపటి వరకు అతని స్వస్థలానికి చేరుకునే అవకాశం ఉంది. మొన్న లేదా నిన్న సరిహద్దు వద్ద జరిగిన కాల్పుల సమయంలో మురళీ నాయక్ మరణించినట్టు తెలుస్తోంది. ముందు వరుసలో పనిచేస్తూ విధి నిర్వహణలో ఉండగా అతను మరణించాడని స్థానిక వర్గాలు నిర్ధారించాయి.

'దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు ము...