భారతదేశం, జూలై 10 -- డిజిటల్ చెల్లింపుల ప్రపంచంలో మరో పెద్ద మార్పు రాబోతోంది. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం, భారతదేశ రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థ యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) స్మార్ట్ అప్‌గ్రేడ్‌ను పొందబోతుంది. స్మార్ట్‌వాచ్‌లు, కార్లు, స్మార్ట్ టీవీలతోపాటుగా ఇతర పరికరాల ద్వారా నేరుగా చెల్లింపులు చేసే అవకాశం ఉండనుంది. అది కూడా యాప్‌ను ఉపయోగించకుండానే జరగనుంది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఆధారంగా యూపీఐ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని అర్థం టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, కనెక్ట్ చేసిన కార్లు మొదలైనవి వాటి ద్వారా యూపీఐ చెల్లింపులను భవిష్యత్తులో చేయవచ్చు.

ఈ కొత్త టెక్నాలజీలో ప్రతి పరికరానికి ప్రత్యేక యూపీఐ ఐడీ (VPA) ఇస్తారు. ఈ వర్చువల్ పేమెంట్ అడ్రస్ ద్వారా పని చేసుకోవచ్చు. ఇ...