భారతదేశం, మే 23 -- ాపిల్‌ సీఈవో టిమ్ కుక్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను భారత్‌లోనో, మరే ఇతర దేశంలోనో కాకుండా అమెరికాలో తయారు చేయాలని అన్నారు. భారత్, ఇతర దేశాల్లో తయారుచేస్తే.. యాపిల్‌‌పై కనీసం 25 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు.

ఈ విషయాన్ని టిమ్ కుక్‌కు చాలా కాలం క్రితమే తెలియజేశానని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లు కూడా భారత్ లేదా మరే ఇతర ప్రాంతంలో కాకుండా అమెరికాలో తయారవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలా జరగని పక్షంలో యాపిల్‌ కనీసం 25 శాతం టారిఫ్‌ను అమెరికాకు చెల్లించాల్సి ఉంటుంది.

భారత్‌లో ఐఫోన్ల తయారీని నిలిపివేసి, దానికి బదులుగా అమెరికాలో ఐఫోన్లను తయారు చేయాలని యాపిల్‌ సీఈఓ టిమ్ కుక్‌ను ఇటీవలే ట్రంప్ కోరారు. చైనాపై అమెరికా సుంకాల ప్రభావం నేపథ్యంలో...