భారతదేశం, జూలై 22 -- సెప్టెంబర్​లో ఐఫోన్​ 17 లాంచ్​ కోసం యాపిల్​ లవర్స్​ ఎదురుచూస్తున్న సమయంలో ఒక షాకింగ్​ రిపోర్టు తాజాగా బయటకు వచ్చింది! ఐఫోన్​ 17 తర్వాత.. స్మార్ట్​ఫోన్​ లైనప్​నకు సంస్థ భారీ మార్పులు చేసేందుకు సిద్ధపడుతోందని, ఇందులో భాగంగా ఐఫోన్​ 18 బేస్​ మోడల్​ని పూర్తిగా తొలగించే ఉద్దేశంలో ఉందని ఆ నివేదిక పేర్కొంది. అంటే, ఐఫోన్​ 17 తర్వాత ఐఫోన్​ 18 విడుదల కాకపోవచ్చని వివరించింది. ఈ సంవత్సరం ఐఫోన్ 17 సిరీస్ విడుదలైన తర్వాత.. కంపెనీ 2026లో తన మొట్టమొదటి ఫోల్డెబుల్ ఐఫోన్​ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ప్రామాణిక ఐఫోన్ 18ని పూర్తిగా నిలిపివేసే అవకాశాన్ని సూచిస్తుంది.

సెప్టెంబర్ 2025లో విడుదల కానున్న యాపిల్ ఐఫోన్ 17 లైనప్​లో.. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వంటి మోడళ్లు ఉం...