భారతదేశం, నవంబర్ 1 -- యాపిల్ కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన ఎయిర్‌పాడ్స్ ప్రో 3 మోడల్ మార్కెట్‌లో అడుగుపెట్టింది. అయితే, ఇది విడుదలైన కొద్ది రోజులకే తదుపరి ఎయిర్​పాడ్స్​పై ఒక క్రేజీ బజ్​ వినిపిస్తోంది! మరిన్ని అత్యాధునిక ఫీచర్లతో, ఏకంగా ఇన్‌బిల్ట్ కెమెరాలతో కూడిన మరో కొత్త ఎయిర్‌పాడ్స్ 2026లో రాబోతున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. యాపిల్ ఆడియో ఉత్పత్తుల శ్రేణిలో ఇదే అతిపెద్ద ఎక్స్​ప్యాన్షన్​ అవుతుంది. ప్రతి ఉత్పత్తిలో మరింత ప్రత్యేకమైన వెర్షన్‌లను అందించాలనే యాపిల్ లేటెస్ట్​ స్ట్రాజజీని ఇది ప్రతిబింబిస్తుంది.

తాజా లీక్స్​ ప్రకారం.. యాపిల్ సంస్థ ఇంటిగ్రేటెడ్ ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్​) కెమెరాలను కలిగి ఉన్న కొత్త ఎయిర్‌పాడ్స్ ప్రో మోడల్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎయిర్‌పాడ్స్ ప్రో 3 కంటే హై-ఎండ్ మోడల్ అవుతుందని సమాచారం...