భారతదేశం, జనవరి 27 -- బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో పనితో బిజీగా ఉన్నాడు. 2023లో విడుదలై సంచలన విజయం సాధించిన తన సినిమా 'యానిమల్'కు రాబోతున్న సీక్వెల్ 'యానిమల్ పార్క్' గురించి అతడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అతడు వెల్లడించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ 'స్పిరిట్' పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడని, అందుకే ఈ సీక్వెల్ నిర్మాణం ఆలస్యం అవుతోందని చెప్పాడు.

'డెడ్‌లైన్' అనే పత్రికతో రణ్‌బీర్ కపూర్ మాట్లాడాడు. యానిమల్ పార్క్ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని అతడు చెప్పాడు. మీరు స్క్రిప్ట్ చదివారా అని అడిగినప్పుడు.. సందీప్ రెడ్డి వంగా సీక్వెల్ ఎలా ఉండబోతుందో తనకు కేవలం హింట్ మాత్రమే ఇచ్చారన...