Hyderabad, జూన్ 30 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.

జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన హరి హర వీరమల్లు గ్లింప్స్, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. జూలై 3న హరి హర వీరమల్లు ట్రైలర్‌ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, హరి హర వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్‌కు పవర్‌ఫుల్ విలన్‌గా యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ నటిస్తున్నారు. యానిమల్ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్ హరి హర వీరమల్లులో మొఘల్ చక్రవర్తి ఔరంగ...