Choutuppal,telangana, జూలై 26 -- యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన పోలీసులు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపునకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావ్ ప్రాణాలు కోల్పోయారు. ఏఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మృతులిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. ఓ కేసు విషయం కోసం వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందటంపై ఏపీ హోంశాఖ మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
ఈ రోడ్డు ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.