భారతదేశం, జనవరి 3 -- కన్నడ యాక్షన్ ఎంటర్‌టైనర్ మార్క్ మూవీ కర్ణాటక అంతటా థియేటర్లలో అదరగొడుతోంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే, ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న మార్క్ సినిమాలో హీరోయిన్ దీప్శిక చంద్రన్ నటన హైలెట్స్‌లో భాగమైంది.

మార్క్ చిత్రంలో దీప్శిక చంద్రన్ నటన ఈలలు, చప్పట్లు కొట్టేలా చేస్తోందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, మార్క్ మూవీలో హీరోయిన్ దీప్శిక చంద్రన్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులందరిని అలరించింది. ముఖ్యంగా దీప్శిక యాక్షన్ బ్లాక్‌తో అదరగొట్టింది. దాంతో ఆమె చేసిన యాక్షన్ ఎపిసోడ్‌కు సూపర్ క్రేజ్ వస్తోంది.

ఈ నేపథ్యంలో దీప్శిక చంద్రన్‌ను "మార్క్ క్వీన్","క్వీన్ ఆఫ్ మార్క్" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఆడియెన్స్, నెటిజన్స్. దీంతో ఇంటర్...