భారతదేశం, అక్టోబర్ 30 -- యశ్ నటిస్తున్న నెక్ట్స్ మూవీ టాక్సిక్ ది మూవీపై తలెత్తుతున్న సందేహాలపై ప్రొడ్యూసర్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ గురువారం (అక్టోబర్ 30) ఓ ట్వీట్ లో ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 19నే రిలీజ్ కానుందని స్పష్టం చేసింది. అటు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసింది.

కేజీఎఫ్ తో కన్నడ సూపర్ స్టార్ అయిన యశ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన విషయం తెలుసు కదా. ఈ మూవీ తర్వాత అతడు నటించే తర్వాతి సినిమాపై ఎంతో ఆసక్తి నెలకొంది. అతడు గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 19న ఉగాది సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించినా.. వాయిదా తప్పదన్న పుకార్లు వచ్చాయి. దీనిపై తాజాగా మరోసారి ప్రొడక్షన్ హౌజ్ కేవీఎన్ స్పందించింది...