భారతదేశం, డిసెంబర్ 21 -- రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Adults). ఈ సినిమా నుంచి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. టాక్సిక్ మూవీ నుంచి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫస్ట్ లుక్‌ను తాజాగా ఇవాళ (డిసెంబర్ 21) రిలీజ్ చేశారు.

టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ చేస్తున్న 'నదియా' పాత్రను పరిచయం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఆదివారం ఉదయం విడుదల చేశారు. కథానాయకుడు యశ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ పోస్టర్‌ను పంచుకుంటూ కియారాకు వెల్‌కమ్ చెప్పారు.

నదియాగా కియారా అద్వానీ అదిరిపోయే మేకోవర్‌ అదిరిపోయింది. ఈ పోస్టర్‌లో కియారా లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బ్లాక్ కలర్ ఆఫ్-షోల్డర్ గౌనులో, హై స్లిట్ కట్ డ్రెస్‌తో కియారా ఎంతో గంభీరంగా కనిపిస్తోంది. డ్యాన్స్ ఫ్లోర్‌పై ఉన్న ...