Hyderabad, ఏప్రిల్ 15 -- యవ్వనం జీవితంలో స్వర్ణయుగం. ఈ వయసులోనే ఎన్నో కలలు కంటారు.వాటిని నెరవేర్చుకోవాలనే తపన కూడా వారిలో ఎక్కువగా ఉంటుంది. కానీ యవ్వనం చాలా చాలా సున్నితమైనది. ఆ వయసులో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు భవిష్యత్తులో పశ్చాత్తాపానికి దారితీస్తాయి.

యవ్వనంలో ఉన్నప్పుడే చాలా సార్లు ఉద్వేగానికి లోనవుతూ కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు యువత. అది వారి కెరీర్ ను, రిలేషన్ షిప్స్ ను, మొత్తం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. గొప్ప దౌత్యవేత్త ఆచార్య చాణక్య కూడా యువత చాలా ముఖ్యమైనదని, యవ్వనంలో చేసే కొన్ని తప్పులు ఒక వ్యక్తి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం యవ్వనంలో ఏయే పొరపాట్లకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

వయసులో ఉన్నప్పుడే భవిష్యత్తును అందంగా నిర్మించుకోవాలి. ఆచార్య చాణక్యుడి ప్రకారం, యవ్వన రోజులను వృ...