Hyderabad, ఆగస్టు 17 -- కమెడియన్‌గా కెరీర్ స్టార్ చేసిన సునీల్ హీరోగా అదరగొట్టారు. ఆ తర్వాత విలన్‌గా నటించి మెప్పించారు. ఎన్నో చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్‌తో ఆకట్టుకున్న సునీల్ మరోసారి యాక్షన్‌తో అలరించేందుకు రెడీగా ఉన్నారు. సునీల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఫైటర్ శివ.

కౌండిన్య ప్రొడక్షన్స్, అరుణ గిరి ఆర్ట్స్ బ్యానర్ల మీద ఉన్నం రమేష్, నర్సింహ గౌడ్ 'ఫైటర్ శివ' సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించారు. ఫైటర్ శివ సినిమాలో సునీల్‌ ప్రధాన పాత్ర పోషించగా మణికాంత్, ఐరా బన్సాల్ హీరో హీరోయిన్స్‌గా జంటగా నటించారు.

అలాగే, ఫైటర్ శివ మూవీలో సునీల్‌తోపాటు సినిమా బండి ఫేమ్ వికాస్ వశిష్ట కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే, శనివారం (ఆగస్ట్ 16) నాడు 'ఫైటర్ శివ' టీజర్‌ను లాంచ్ చేశారు. ఫైటర్ శివ టీజర్‌ను...