భారతదేశం, మార్చి 12 -- యమహా దేశీయ మార్కెట్లో వివిధ బైక్‌లు, స్కూటర్లను విజయవంతంగా విక్రయిస్తోంది. ఇవి మరింత అధునాతన డిజైన్లు, ఫీచర్లను కలిగి ఉన్నాయి. వినియోగదారులు కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. యమహా ఇప్పుడు హైబ్రిడ్ (పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్) టెక్నాలజీని కలిగి ఉన్న సరికొత్త FZ-S Fi మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.

యమహా FZ-S Fi హైబ్రిడ్ బైక్ సరసమైన ధరకు విడుదల అయింది. దీని ధర రూ. 1.45 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ FZ-S Fi దేశంలో 150సీసీ విభాగంలో హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉన్న మొట్టమొదటి బైక్‌గా కూడా అవతరించింది. కొత్త 2025 యమహా FZ-S Fi హైబ్రిడ్ మోటార్‌సైకిల్ మరింత కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. ఇది మెరుగైన హెడ్‌లైట్లు, పెద్ద ఇంధన ట్యాంక్, ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ టర్న్ సిగ్నల్‌లను కలిగి ఉంది. ఇది రేసింగ్ బ్లూ అండ్ సియాన్ మెటాలిక్ గ్రే క...