భారతదేశం, నవంబర్ 17 -- ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యమహా ఎక్స్​ఎస్​ఆర్​ 155 బైక్​ భారతదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.50 లక్షలుగా ఉంది. స్టైలిష్‌గా ఉండే ఈ నియో-రెట్రో బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కి గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ రెండు బైక్‌లు కూడా రెట్రో, మోడర్న్​ శైలిని కలిగి ఉన్నప్పటికీ.. ధర, ఇంజిన్ స్పెసిఫికేషన్స్​, ఫీచర్ల విషయంలో మాత్రం ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉన్నాయి. మీ ఎంపికను మరింత సమర్థవంతంగా నిర్ణయించుకోవడానికి ఈ రెండింటి మధ్య తేడాలను ఇక్కడ పరిశీలిద్దాము.

యమహా ఎక్స్​ఎస్​ఆర్​ 155 పవర్ కోసం 155సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజిన్‌ను ఆర్​15, ఎంటీ-15 బైక్‌లతో పంచుకోవడం జరిగింది. ఇది 10,000 ఆర్‌పీఎమ్ వద్ద 18.4 హెచ్‌పీ పవర్​ని, 7,500 ఆర్‌పీఎమ్ వద్ద 14.1 ఎన్ఎమ్ టార్క్‌ను అంది...