భారతదేశం, మే 20 -- తాత ఘన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. బాల నటుడిగానే తెరంగేట్రం చేశారు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా యాక్టింగ్ తో అదరగొడుతున్నారు. 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన జూనియర్ నందమూరి తారక రామారావు అంచెలంచెలుగా ఎదిగారు.

బాక్సాఫీస్ ను శాసించే స్థాయికి చేరారు జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' మూవీతో గ్లోబల్ రేంజ్ కు చేరారు. మంగళవారం (మే 20) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తారక్ టాప్-5 మూవీస్ ఏంటో చూసేయండి.

రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' మూవీ గ్లోబల్ సెన్సేషన్ గా మారింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయ్యస్ట్ కలెక్షన్లు రాబట్టిన మూవీగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ మూవీలో 'నాటు నాటు' పాటక...