భారతదేశం, జనవరి 1 -- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, డిసెంబర్ 2025 నాటికి 1,000 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులను ఉద్యోగాలు వచ్చే విధంగా, పారిశ్రామిక అవసరాలకు సన్నద్ధం చేయడానికి ఈ విశ్వవిద్యాలయం స్థాపించారు. వెయ్యి మందికి శిక్షణ లక్ష్యాన్ని సాధించడం ద్వారా నైపుణ్య విద్యా రంగంలో ఒక ముఖ్యమైన సంస్థగా అవతరించింది.

విశ్వవిద్యాలయం ప్రస్తుతం లాజిస్టిక్స్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ సైన్సెస్ వంటి రంగాలలో నైపుణ్యం ఆధారిత శిక్షణా కార్యక్రమాలను అందిస్తోంది. స్వల్పకాలిక, సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా కోర్సు పూర్తయిన వెంటనే ఉపాధిని కల్పించడానికి వ...