భారతదేశం, డిసెంబర్ 6 -- మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన 'డైస్ ఇరే' మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మలయాళ థ్రిల్లర్ ఇప్పటికే రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (డిసెంబర్ 6) నుంచి మరో ఓటీటీలోనూ ఇది ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.

మలయాళ హారర్ థ్రిల్లర్ డైస్ ఇరే మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది. శనివారం నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంది. అయితే ఇది కేవలం ఇండియా బయట వేరే దేశాల్లో ఉన్న ఆడియన్స్ కోసమే.

అసలైన హారర్ తో భయపెట్టే డైస్ ఇరే ఇప్పటికే రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రణవ్ మోహన్ లాల్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 5) నుంచి జియోహాట్‌స్టార్‌తో పాటు సింప్లీ సౌత్ ఓటీటీల్లో అందుబాటులో ఉంది....