Telanana,nalgonda, అక్టోబర్ 10 -- గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా నల్గొండ జిల్లాలోని చిట్యాలలో ఎమ్మార్వోగా విధులు నిర్వర్తిస్తున్న గుగులోతు కృష్ణ ఏసీబీకి చిక్కారు. ఆయనతో పాటు మరో ప్రైవేట్ వ్యక్తిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఓ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ఒక వ్యవసాయ భూమి యొక్క మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మరియు మరొక వ్యవసాయ భూమి యొక్క సర్వే నివేదికను సమర్పించేందుకు రూ. 2 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి. ఏసీబీని ఆశ్రయించాడు. రూ. 2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. గట్టు రమేశ్ అనే ప్రైవేట్ వ్యక్తి కూడా పట్టుబడిన వారిలో ఉన్నాడు.

ఏ ప్రభుత్వాధికా...