భారతదేశం, ఆగస్టు 12 -- ఇన్వెస్ట్ చేసేవారు దీర్ఘకాలిక ప్రయోజనాలను గ్రహించి పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తున్నారు. ఇది భారతీయుల పొదుపు అలవాట్లలో వచ్చిన పెద్ద మార్పుగా చెప్పవచ్చని నిపుణులు అంటున్నారు. మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సిప్ పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. నిజానికి చాలా రోజులుగా భారత స్టాక్ మార్కెట్లలో అస్థిరమైన ట్రేడింగ్ ఉంది. అయిన కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్‌ఫ్లోలు పెరిగాయి. జూలై నెలలో మ్యూచువల్ ఫండ్స్ సిప్ ఇన్‌ఫ్లోలు నెలవారీగా 4 శాతం పెరిగి రూ.28,464 కోట్లకు చేరుకున్నాయి. ఇది జూన్ 2025లో రూ.27,269 కోట్లుగా ఉంది.

ఏఎంఎఫ్ఐ డేటా ప్రకారం.. జూన్‌లో 8.64 కోట్ల సిప్ ఖాతాల సంఖ్యతో పోలిస్తే.. జూలైలో 9.11 కోట్లకు పెరిగింది. నిర్వహణలో ఉన్న సిప్ విలువ జూన్‌లో రూ.15.19 లక్షల కోట్లుగా ఉన్నాయి. జూలైలో రూ.15.31 లక్షల కోట్లుగా ఉన్నాయి. మ్యూచువల్...